
Gangamma's mother Bonala fair
గంగమ్మ తల్లి బోనాల జాతర,
రాయికల్,జులై 31, నేటి ధాత్రి:
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున పెద్దవాగు నది తీరాన గంగమ్మ కమిటీ ఆధ్వర్యంలో గంగాదేవి, మరియు పరమశివుని విగ్రహల ప్రతిష్టలు పండితులు కృష్ణ ప్రసాద్ శర్మ, సంతోష్ లు ఘనంగా నిర్వహించారు.. మహిళలు బెల్లపు అన్నం వండుకొని బోనం నెత్తిపై పెట్టుకుని జంబి గద్దె నుండి పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య, భక్తి పాటలతో పెద్దవాగు గంగమ్మ తల్లికి, మా పిల్లలు, మా కుటుంబాలు, బాగుండాలని మనసారా మొక్కుకొని నైవేద్యం సమర్పించారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, గంగమ్మ తల్లి కమిటీ సభ్యులు, గ్రామ సేవా సమితి కార్యవర్గ సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు, దాతలు, డాక్టర్ కాటిపెల్లి నారాయణరెడ్డి, కొడిమ్యాల భూoరావు, సురభి భూo రావు, విగ్రహ దాతలు ఉట్నూరి రవి, మరిపెళ్లి నారాయణ గౌడ్, చెన్నమనేని వంశీయులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, యువకులు, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.