
MLC Sirikonda Madhusudhanchari
నా చివరి శ్వాస వరకు భూపాలపల్లి ప్రజలతోనే
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ స్పీకర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్చారి అంబేద్కర్ విగ్రహానికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలవేసి బిసి బీసీలకు న్యాయం జరగాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ నా చివరి శ్వాస వరకు భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలతోని కలిసి ఉంటారని అన్నారు
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్రాన్ని కెసిఆర్ నాయకత్వంలో సాధించడం జరిగింది అనంతరం 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి నేను ఎమ్మెల్యేగా భూపాలపల్లి నియోజకవర్గంలో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి కెసిఆర్ నాకు స్పీకర్ పదవిని ఇవ్వడం జరిగింది దానితో భూపాలపల్లి నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశాను అనంతరం జిల్లా ఏర్పాట్ల కూడా నా వంతు కృషిచేసి ప్రొఫెసర్ జయశంకర్ పేరుమీద జయశంకర్ నూతన జిల్లాను తీసుకురావడం జరిగింది నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో పర్యటించి పల్లెనిధులు చేసి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాను కావున నా అభిమానులు కార్యకర్తలు ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు నా చివరి శాస వరకు భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలతోని ఉంటాను ప్రతి నెలలో రెండు రోజులు నియోజకవర్గంలోని ఉంటాను ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని అన్నారు ఈ కార్యక్రమంలో సిరికొండ అభిమానులు పాల్గొన్నారు