
Kingdom Review.
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఎలా ఉందంటే ట్విట్టర్ రివ్యూ
ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (జూలై 31)న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తెలుగు చిత్రం కింగ్డమ్
ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (జూలై 31)న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తెలుగు చిత్రం కింగ్డమ్ (Kingdom). విజయ్ దేవకర కొండ (Vijay Devarakonda), సత్యదేవ్ (Satya Dev), భాగ్య శ్రీ భోర్సే ( Bhagyasri Borse) కీలక పాత్రధారులు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి చాలా విరామం దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై నాగవంశీ నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సుమారు ఏడాదిన్నరగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్లో, ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే షోలు పడగా చాలా మంది సినిమా చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి వారి మాటలు, పోస్టుల్లో సినిమా ఎలా ఉందో.. తెలసుకుందాం
ఇక సెకండాఫ్ అంతా ఎమోషనల్ రైడ్‌గా మార్చారని, అక్కడ దీవికి రాజుగా మారే విధానం గూస్బంప్స్ తెచ్చేలా ఉందని, విజువల్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయని, రియలస్టిక్‌గా సీన్స్ ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. ఫస్టాప్లోని కథకు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలకు మధ్య లింక్ బాగా కుదిరిందని కామెంట్లు చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఓ తెలుగు సినిమా నుంచి మంచి స్టఫ్ వచ్చిందని, పెట్టిన డబ్బులకు మంచి సాటిస్ఫ్యాక్షన్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా బక్కోడు అనిరుధ్ (Anirudh Ravichander) తానేందుకు ప్రత్యేకమో ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ నిరూపింస్తుందని, అంతలా సినిమాను ఎలివేట్ చేశాడని తెగ పొగిడేస్తున్నారు. ఇంకా విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి నటన ఎక్స్‌ఫర్ట్ చేయలేదని మొత్తంగా ఫ్యాన్స్‌కే కాక టాలీవుడ్‌కు , సినీ లవర్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారని రాసుకొస్తున్నారు.
‘ఏదో ఏదో గమ్మత్తుగా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను సినిమా నుంచి తొలగించారు. ఆ పాటే కోసం సినిమాకు వెళ్లిన ఫాన్స్ నిరుత్సాహ పడ్డారు’.
చివరగా క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్టు ఎక్సలెంట్‌గా ఉందని, సినీమా ప్రతి ఫ్రేమ్‌లో గౌతమ్ టాలెంట్ కనిపిస్తుందని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. మరి కొంతమంది బోరింగ్ ఉందని, స్లోగా సాగుతూ విసుగు తెప్పించారని కామెంట్లు సైతం చేశారు. ఓవరల్‌గా సినిమా అయితే మస్ట్ వాచ్ లిస్టులో చేర్చుకోవచ్చని, ఈ సినిమాను థియేటర్లోని చూసి ఎక్స్పీరియన్స్ కావాలని, హితవు పలుకుతున్నారు. రగిలే పాట అయితే సినిమా పూర్తయ్యాక కూడా హంట్ చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఏడేండ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టాడని రివ్యూలు ఇస్తున్నారు.