
Former Minister Koppula Easwar.
కంది రాజరత్నం కుటుంబంతో విడదీయలేని బంధం…
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
విప్లవకార ఉద్యమ కాలంలో కంది రాజారత్నంతో విడదీయలేని బంధం ఉండేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రెండు రోజుల క్రితం కంది రాజారత్నం భార్య కంది రాజ నరసక్క మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుమారుడైన కంది క్రాంతి కి ,కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. నాతోటి సహచరుడిగా సుపరిచితమైన కంది రాజారత్నం 1994లో ఎన్కౌంటర్ లో మృతి చెందినప్పటికీ కంది రాజనరసక్క సైతం అదే ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. వారి మృతి తీరనిలోటని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కెంగర్ల మల్లయ్య, కనకం శ్యామ్, బోనగిరి నర్సింగ్, బడికల సంపత్, మోహన్ ,పాండు, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, మహేష్, నాయకులు గడ్డం రాజు, నందిపేట సదానందం, చంద్ర కిరణ్, దబ్బేటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.