
BRS Party President Rega Kantarao.
బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చర్ల మండల కేంద్రంలో విస్తృత పర్యటన
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ
నేటిధాత్రి చర్ల
చర్ల మండల పర్యటనలో భాగంగా పలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబాలను బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మరియు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు మానే రామకృష్ణ చర్ల పట్టణంలో వున్న ప్రముఖ వ్యాపారి కీర్తిశేషులు బొజ్జ నాగేంద్ర బాబు జయంతి సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు తదనంతరం ఇటీవల వివాహం జరుపుకున్న
బి ఆర్ ఎస్ పార్టీ చర్ల పట్టణ యువజన అధ్యక్షులు గౌలికార్ ప్రేమ్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు తదనంతరం చర్ల పట్టణానికి చెందిన మేజర్ పంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ కవ్వాలా రజిత పార్టీ మండల నాయకులు కవ్వాల రాంబాబు నివాసానికి వెళ్లి యోగక్షేమాలను తెలుసుకొని గొంపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు గుడపాటి రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్ళు తీవ్ర దుఃఖంలో వున్న ఆ కుటుంబాన్ని ఓదార్చి వారి కుటుంబానికి పార్టీ అండగా వుంటుంది అని తెలిపారు తదనంతరం తెగడా గ్రామంలో
బి ఆర్ ఎస్ పార్టీ మండల యువజన కార్యదర్శి కుప్పలా నిరంజన్ తండ్రి కుప్పలా పూర్ణచందు మనోహర్ దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు