
GP officers
గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు
మండల అధికారులు సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేసినప్పటికి మారని జీ.పి.అధికారుల పనితీరు
ప్రధాన సమస్యగా వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు
పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం లేదు.వర్షాలు కురుస్తున్న సందర్భంలో గ్రామాల్లో మురికి కాలువలలో పేరుకుపోయిన మురుగునీరు,ఎక్కడ చెత్త అక్కడే వదిలేసిన తీరు చూస్తే గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని చెప్పవచ్చు.భారీ వర్షాల కారణంగా గ్రామాలరోడ్లు బురదమయంతో నిండిపోయి మురికి కాలువలో మరియు నీరు లోతట్టు ప్రాంతాలలో నిలువఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తరులు జారీ చేసిన,మండల అధికారులు సమావేశలు పెట్టి ఆదేశాలు జారీచేసినప్పడికి కొన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలపై పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ సమయంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేషియా సీజనల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపిచెందే అవకాశలున్నాయి.వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిసినప్పటికి కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల మందు గాని స్ప్రే చేయడం నివారణ చర్యలు ఏమాత్రం చేపట్టలేదు.వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నిల్వవున్న నీటిని కాళీ చేసే చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రజలు పంచాయతీ సిబ్బంది పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీరు నిల్వ వల్ల ప్రాణంతకమైన దోమలు గుమిగుడుతున్నాయని కొంతమంది పంచాయతీ అధికారులు అయితే ప్రజలు తమ గోడు విన్నవించుకున్నప్పటికి కొన్ని నెలలుగా మాకు ఎలాంటి నిధులు రావడంలేదని మాట దాటేస్తున్నట్టు సమాచారం,అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తమ ప్రణాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు
వెలగని విద్యుత్ దీపాలే ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.గ్రామాలలో ఎక్కడ చూసిన వెలగని విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.ఒక చోట ఉంటే ఇంకోచోట ఉండకపోవడం ఇలా అన్ని గ్రామాలలో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు.వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏదైనా అవసర నిమ్మిత్తం బయటకు వెళ్లాల్సివస్తే విషపురుగులు కాటేస్తాయేమో అనే భయంతోనే బయటకు వెళుతున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారు.మరికొన్ని చోట్ల అయితే రోడ్లకు ఇరువైపులా భారీగా చెట్లకొమ్మలు పెరిగి విద్యుత్ దీపాలకు అడ్డుగావచ్చి రాత్రికాల సమయంలో ప్రయాణించే వాహనదారులకు వెలుగులు లేక గుంతలు కనిపించక తమ ప్రయాణం ఒక నరకంగా వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.