
Kingdom
అంచనాలు మించేలా వస్తున్నాడు.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ వైరల్..
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’. ఈ చిత్రం హిందీ టైటిల్ ను తరం ఆదర్శ్ రివీల్ చేశారు
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.