
President Hariprasad Nayak..
*కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..
*గిరిజనులను హేళనగా మాట్లాడిన హీరోను అడ్డుకుంటాం..
*నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్..
తిరుపతి(నేటి ధాత్రి(;జూలై 25:
విజయదేవర కొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ కు తిరుపతిలో అనుమతి రద్దు చేయాలని నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ నగర పాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన హిరో సూర్య రెట్రో చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హీరో విజయదేవకొండ హాజరయ్యారని, ఈవెంట్ కార్యక్రమంలో అభిమానుల తోపులాటను గుర్తించిన విజయదేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. వివక్షత లేని సమాజం సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవల ఫల్మాం సంఘటనలో దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మురళీ నాయక్ మా జాతి బిడ్డ అని గర్వంగా చెప్పారు. అలాంటి గిరిజన జాతిని హేళనగా మాట్లాడిన దేవరకొండ సినిమా కింగ్డమ్ చిత్రం ఈవెంట్‌ను తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నేతలు రవీంద్రనాయక్, శివశంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.