
CI Shashidhar Reddy.
గాంధారి మైసమ్మ జాతరకు సహకరించిన అధికారులకు ఘన సన్మానం…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనే గల గాంధారి మైసమ్మ బోనాల జాతర సజావుగా సాగేందుకు అహర్నిశలు కృషిచేసి, ఆలయ కమిటీకి ఎల్లవేళలా సహకరించిన మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం చివరి ఆదివారం నిర్వహించే గాంధారి మైసమ్మ జాతరకు పోలీస్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు జాతరను సజావుగా సాగించేందుకు కృషి చేస్తారని అందులో భాగంగానే ఈ సంవత్సరం జరిగిన ఆషాడ మాస బోనాల జాతరను దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు అధికారులను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జక్కుల సమ్మయ్య, సత్యనారాయణ, పారుపల్లి తిరుపతి, భీమ సుధాకర్, మొగిలి, కనకయ్య, రాజయ్య, కుమార్, తిరుపతి, ఓదెలు, మొండి, కుమార్ గౌడ్, శంకర్, ప్రధాన అర్చకులు రమణాచారి, లవ కుమార్ లు పాల్గొన్నారు.