
MLA Dr. Bhukya Murali Nayak
కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్…
నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేయండి… ఎమ్మెల్యే మురళి నాయక్…
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంతి హాస్పిటల్ ని గురువారం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి,
సుదూర ప్రాంతాల నుంచి వైద్య నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవ సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మరింత అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాస్పటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ ,జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.