
Chief Minister Revanth Reddy.
కరీంనగర్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తా
నగర ప్రజలు ఆందోళన చెందవద్దు
నిరంతరం అండగా ఉంటాం
బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ లో ఈదుస్థితి
కరీంనగర్లో వర్షం వర్షపు నీరు వరద ఉధృతి వల్ల ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలించిన వెలిచాల రాజేందర్ రావ్
నష్టపోయిన వారికి తక్షణమే సాయం అందించాలని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ కు సూచన
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్లో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్లు, కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్నాయనీ శాశ్వతంగా ఈవరద సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గురువారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షం, వరద ఉధృతి వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. సుభాష్ నగర్, వావిలాలపల్లి, ఆదర్శనగర్, మంచిర్యాల చౌరస్తా, కమాన్ ప్రాంతం, లక్ష్మీ నగర్, గాయత్రి నగర్, శర్మ నగర్లో మాజీ కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాసు, మెండి చంద్రశేఖర్ శ్రీలత, కట్ల సతీష్ తో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాలను మొత్తం కలియతిరిగి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో రాజేందర్ రావు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి నీరు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బందులను గమనించి రాజేందర్ రావు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ తో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యవసర సరుకులు అందించాలని సూచించారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలనీ, తగిన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో వరద ఉధృతి నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా కాలనీల్లో పరిస్థితిని సమీక్షిస్తున్న మున్సిపల్ అధికారులకు రాజేందర్ రావు తగిన సూచనలు చేశారు. కరీంనగర్లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సమస్య ఒక ప్రహసనంగా మారిందని, దీనికి ఒక శాశ్వత పరిష్కారం మార్గాన్ని త్వరలోనే కనుక్కుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి ఈసమస్యను తీసుకెళ్లి దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతానని రాజేందర్ రావు పేర్కొన్నారు. నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనీ, అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే డ్రైనేజ్ సిస్టం పూర్తిగా అధ్వానంగా మారిందని రాజేందర్ రావ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల రోడ్లు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయనీ, ఈదుస్థితి రావడానికి వారే కారణమని మండిపడ్డారు. వరద ఉధృతి వల్ల వర్షపు నీరు ఏలాంటి ఆటంకం లేకుండా ఎక్కడ నిల్వకుండా సాఫీగా వెళ్లిపోయేలా ఒక పరిష్కార మార్గాన్ని తప్పకుండా అన్వేషిస్తామనీ, ఈసమస్యకు ముగింపు పలుకుతామని ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాజేందర్రావు స్పష్టం చేశారు. నగర ప్రజలు ఎక్కడా ఎలాంటి సమస్య వచ్చినా మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, దృష్టికి తీసుకురావాలని, తమ దృష్టికి సైతం తీసుకురావచ్చని సూచించారు. ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని రాజేందర్ రావు తెలిపారు. కాలనీలో రోడ్లపై నీరు నిలవకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలు, రోడ్లపై మురికి గుంతలు, మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ, రాత్రివేళలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాత్రివేళ విదీదీపాలు వెలిగేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు వరద బాధితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని పిలుపునిచ్చారు. ఏఆపద వచ్చినా ముందుకు వచ్చి తగిన సహాయమందించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోటగిరి భూమా గౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు గుమ్మడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.