
Doma Sujith
హద్నూర్ ఎస్సైగా దోమ సుజిత్ విధుల్లో చేరిక..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండలం, హద్నూర్ ఎస్సైగా దోమ సుజిత్ మంగళవారం రాత్రి విధుల్లో చేరారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న సుజిత్ బదిలీపై వచ్చారు. ఇదివరకు హద్దునూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన చెల్లా రాజశేఖర్ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.