
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మెట్ పల్లి జూలై 21 నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ –
కళాశాల విద్యా కమీషనర్ ( సీసీఈ) ఏ.శ్రీదేవసేన మరియు మల్టీ జోన్ – I,జాయింట్ డైరెక్టర్ (జేడీ) ప్రొఫెసర్ డీ.ఎస్.ఆర్. రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, పొలిటికల్ సైన్స్,కామర్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య తెలిపారు.
సోమవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీ.జీ)తో పాటు యుజిసి నెట్,సెట్,పీహెచ్.డి వంటి అర్హతలు గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.దరఖాస్తుతో పాటు తమ బయోడేటా మరియు అర్హత, అనుభవం వంటి అన్ని సర్టిఫికెట్ల “జిరాక్స్ కాపీల సెట్”ను విధిగా సమర్పించాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఈ నెల 25 వ తేదీన అనగా శుక్రవారం రోజున అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల వరకు తప్పకుండా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.దరఖాస్తుదారులు ఆలస్యంగా వస్తే మాత్రం వారి దరఖాస్తులను పరిశీలించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఇతర వివరాలకు మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో పని వేళల్లో కళాశాల సిబ్బందిని సంప్రదించాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అభ్యర్థులకు సూచించారు.