
మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి తీరని లోటు
మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ వడ్డేపల్లి మనోహర్,బిసి సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారెడ్ల శ్రీనివాస్,బిసి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ వివిధ బిసి సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభను సోమవారం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఒక జర్నలిస్టు గా తన జీవితాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తెలంగాణ సమాజం కొరకు తన ఉద్యోగాన్ని వదిలి తెలంగాణా సాధనకై కొట్లాడిన బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అని గుర్తుచేశారు.మహాత్మ జ్యోతిబా ఫూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కొరకై పోరాడిన వ్యక్తి ప్రభంజనం యాదవ్ అని తెలిపారు.ఆయన పోరాటాలను గుర్తుచేస్తూ ప్రస్తుతం జరుగుతున్నా సామాజిక న్యాయం కొరకై ప్రతిఒక్కరు ముందుకు రావాలని అన్నారు.బహుజన మేధావుల ఆశయ సాధనకై మనవంతు పోరాటం చెయ్యాలని మన హక్కులను మనం సాధించుకోవాలని తెలిపారు.ప్రభంజన్ యాదవ్ మృతి తీరని లోటు అని అన్నారు.అనంతరం ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ చిత్రపటానికి మూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్యపు దీపక్,కార్యదర్శి పాడాల శివతేజ,వివిధ బిసి సంఘాల నాయకులు గజెల్లి వెంకన్న, రాజన్న యాదవ్,నామిని రాజన్న,మాదాసు రాజేష్, దురిశెట్టి రాజేంద్రప్రసాద్, భీమ్సేన్,దాంసరి రాజన్న చారి,అంకం సతీష్,సల్మాన్ ఖాన్,పెద్దల్ల చంద్రకాంత్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.