
Sri Dharma Shasta Ayyappa Swamy Temple
అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.