
అనుపమ ‘పరదా’ మూవీ అప్డేట్..
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారింది. ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అనుపమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. త్వరలో ‘జానికి v/s స్టేట్అఫ్ కేరళ’ మూవీతో ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సురేష్, అనుపమ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 18న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో పాటు అనుపమ ‘పరదా’ (parada)సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. దీనికి ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ ఆనంద మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), టాలీవుడ్ హీరోయిన్ సంగీత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సోఫియో ఫాంటసీ కాన్సెప్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినీ ప్రియులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ‘యాత్ర నార్యస్తు” సాంగ్ లిరికల్ వీడియో జులై 17న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించింది. “స్త్రీ హృదయాన్ని ప్రతిధ్వనించే పాట రాబోతుంది” అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ముసుకులో ఉన్న ఆమె పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.