
ఇక నన్ను ఎవరూ ఆపలేరంటూ అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇప్పటికీ వరుస సినిమాలు, షోస్‌లో కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. చివరగా బిగ్‌బి ‘కల్కి’ మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆయన ఏ ప్రాజెక్ట్ చేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిత్యం అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)పై ప్రశంసలు కురిపిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా, అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఒక ఏడాదిలో ఐ వాంట్ టు టాక్, హౌసుల్-5 (Housefull-5), కాళీధర్ లాపత (Kalidhar laapatha), వంటి మూడు విభిన్నమైన సినిమాల్లో నటించాడు.
ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఆ మూడు చిత్రాల్లో పాత్రలు పోషించాడు. ఆయా సినిమాల్లో నాకు ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది. ఈ రోజుల్లో ఇలా చూడటం ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక పాత్రను పూర్తిస్థాయిలో అంగీకరించి.. అద్భుతంగా నటించాడు. నటుడిగా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియజేశావే. ఇంకా ఈ సంవత్సరం ముగియలేదు. ఇంకా ఎన్ని విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నావో. ఒక తండ్రిగా నా తనయుడిని ప్రశంసించడాన్ని ఎవరూ ఆపలేరు. ” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.