
Issuing cheques
చెక్కులు ఇప్పించేందుకు… రూ.30 లక్షల కమీషన్!
◆:- అసైన్డు భూమికి పరిహారం రాదంటూ తిరకాసు పెట్టిన అధికారులు
◆:- ఆందోళనతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
◆:- ఇదే అదనుగా యంత్రాంగం సహకారంతో రంగంలోకి దిగిన దళారులు
◆:- అంతా తాము చూసుకుంటామని ఇద్దరు రైతులతో బేరసారాలు
◆:- వాళ్లు చెప్పినట్లుగా తక్కువ సమయంలో చెక్కులు ఇచ్చేసిన అధికారులు
◆:- కమీషన్ డబ్బులు ఇచ్చి. ఆధారాలతో దందాను వెలుగులోకి తెచ్చిన రైతులు
◆:- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోక ఆవేదన
◆:- నిమ్జ్ భూసేకరణలో పెద్ద ఎత్తున సాగిన అక్రమాలకు నిదర్శనమీ ఘటన

జహీరాబాద్ నేటి ధాత్రి:
అసైన్లు భూములున్న వారే లక్ష్యంగా అధికారు లు పెద్దయెత్తున దందా సాగించారు. రైతుల అవగాహన లేమి, ఇతరత్రా అంశాలను ఆధారం చేసుకొని రూ.కోట్లు వెనకేసుకున్నారు. దళారులను ముందు పెట్టి పని నడిపించారు. ఎకరాకు ఇంత అని రేటు పెట్టి మరీ దర్జాగా వసూళ్లకు పాల్పడ్డారు. రైతులు ఎన్ని రోజులు తిరిగినా విడుదల కాని చెక్కులు, దళారుల సాయం తీసుకుంటే రోజుల వ్యవధిలోనే చేతికం దాయి. యంత్రాంగం, గ్రామాల్లోని దళారులు కలిసి సాగించిన కమీషన్ల దందాకు ఈ ఘటనే నిదర్శనం.
తిరిగి తిరిగి అలసిపోయారు!

న్యాల్ కల్ మండలం గణేష్ పూర్ గ్రామానికి చెందిన యోహాన్, సీమన్ అన్నదమ్ములు. వారికి ఒక్కొక్కరికి 4.19 ఎకరాల భూమి ఉంది. నిమ్జ్
కోసం ఈ భూములను సేకరించారు. అయితే ఈ భూములకు పరిహారం రాదని, కొన్ని రకాల కారణాలతో చెక్కులు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో అన్నదమ్ములిద్ద రూ ఆందోళన చెందారు. తమకు చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం ఈ భూములను ఇచ్చిందని, పరిహారం ఇవ్వాలని విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. నెలల తరబడి కార్యా లయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపో యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కులు రావని అధికారులు స్పష్టం చేశారు.
దళారులను రంగంలోకి దించారు!

న్యాయంగా యోహాన్ కు రూ.67లక్షలు, సీమన్ కు రూ.67లక్షలు వస్తాయి. కావాలనే అధికారు లు చెక్కులు ఆపేశారు. వారే హుసెళ్లికి చెందిన ఒక దళారిని రంగంలోకి దించారు. అతడు వెళ్లి నేరుగా వీరిద్దరితో మాట్లాడారు. ‘మీకెందుకు నేను అధికారులతో మాట్లాడుతాను. మీకు చెక్కులు ఇప్పిస్తాను. కానీ ఒక్కొక్కరు రూ.15ల క్షలు ఇవ్వాలి. లేకుంటే మీకు రూపాయి కూడా రాద’ని చెప్పుకొచ్చాడు. దీంతో భయపడిపో యిన అన్నదమ్ములు చేసేదేమీలేక సరేనన్నారు. దళారి చెప్పినట్లుగానే రోజుల వ్యవధిలోనే ఇద్దరి కీ చెక్కులు వచ్చాయి. తాము నెలలుగా తిరిగినా అందని చెక్కులు.. జెట్ స్పీడుతో వచ్చేయడంతో అన్నదమ్ములిద్దరూ అవాక్కయ్యారు.
ఆయన చేతికే చెక్కులు!

అధికారులు ఈ చెక్కులనూ దళారి చేతికే ఇచ్చే శారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం విషయంలో ఇంత పెద్దయెత్తున దందా నడవడం తో సీమెన్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధారాలతో సహా ఈ బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించారు. ‘దళారి చేతికే రూ.67లక్షల విలువైన చెక్కు ఇచ్చారు. ఆయన నన్ను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లాడు. అక్కడ చెక్ డిపాజిట్ చేయించాడు. మా ఖాతాలో డబ్బు పడగానే.. రూ.15లక్షలు ఆయన ఖాతాలోకి పంపించుకున్నాడు. ఈ అంశమై చర్యలు తీసుకోండి’ అంటూ హద్నూర్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోలేదు. నిమ్జ్ భూసేకరణ మాటున సాగిన, సాగుతున్న దందాలకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు వెళ్లి అధికారులు విచారణ చేసినా. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
