
Farmers
కనిపించని నక్ష బాట.
– సమస్యలో పర్వేద- సంకేపల్లి మధ్య నక్షదారి.
– మా స్థలంలో వేశారు అంటే మా స్థలంలో వేశారు అని గొడవ.
– రైతులకు ఆగిపోయిన రాకపోకలు.
శంకర్ పల్లి, నేటిధాత్రి :
శంకర్పల్లి మండలం సంకేపల్లి గ్రామ పరిధిలో సరిహద్దు(పొలిమేర) దారి విషయంలో సంకేపల్లి గ్రామ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పొలాలకి వెళ్లడానికి దారి లేక అయోమయంలో పడ్డారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే సంకేపల్లి పర్వేద మధ్యలో సరిహద్దు దారి గత 25 సంవత్సరాలుగా ఉన్నది. ఆ దారి నుంచే రైతులు రాకపోకలు చేస్తున్నారు తమ పొలానికి కావాల్సిన ఎరువులు, పండిన పంటలను తీసుకెళ్లడం ఇదే దారి వెంట కొనసాగిస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం పొలిమేర దారి వెంట పొలం ఉన్న రైతులు ప్రభుత్వ సర్వేయర్ తో సర్వే చేయించగా పర్వేద గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో నుంచి రోడ్డు వేశారు అని సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఆయన తన పొలంలో నుంచి వేసిన రోడ్డు ను తవ్వేశారు. అయితే సంకేపల్లి గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 25, 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై మేము మా పొలాలకు వెళ్తున్నాము అని ఇప్పుడు రోడ్డును తవ్వి వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు. అయితే పర్వేద రైతులు మాత్రం రోడ్డు మా పొలంలో వేశారు అని సర్వేయర్ చెప్పిన దాని ప్రకారం అయితే రోడ్డు సంకేపల్లి గ్రామస్తుల పొలంలో నుంచి వెళ్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలి అని రైతులు కోరుకుంటున్నారు. పంటల కాలం కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు స్పందించాలి అని రైతులు కోరుకుంటున్నారు.