
Friend's Family.
స్నేహితురాలి కుటుంబానికి అండగా పాత మిత్రులు.
కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితురాలు తల్లి లింగంపల్లి వినోద అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా,మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న బ్యాచ్‌కి చెందిన కోర్కిశాల గ్రామంలోని లింగంపల్లి అనిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మ లింగంపల్లి వినోద ఈ నెల 02-07-2025 రోజున అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది 10వ తరగతి చదువుకున్న అప్పటి చిన్న నాటి స్నేహితులుకోర్కిశాల గ్రామంలోకి వెళ్ళి అనితని వాళ్ళ కుటుంబాన్ని పరమార్చించడం జరిగింది అనంతరం 11వరోజుకి(పెద్ధకర్మ)చేయవలసిన కార్యక్రమానికి అప్పటి చిన్న నాటి స్నేహితులు పదివేల రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమానికి వచ్చినవారు..దూడపాక.రాజు శెనిగరపు శ్రీనివాస్.దానబోయిన రామ్ కుమార్.దానబోయిన నరేందర్.శరత్ కుమార్.బండి అనిల్ కుమార్.సుప్రియ.శృతి సుమలత.సుజాత.మమత.నీలిమ.చామంతి పాల్గొనడం.జరిగింది