
MLA Gurajala Jagan Mohan
కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.
చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 11:
చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కాజూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కుమారి ఆముద పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు చూడా చైర్ పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుష్పాలు, గజమాలతో కాజూరు ప్రాంత కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఘన స్వాగతం పలికారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కాజూరు ప్రజలకు వారు
వివరించారు,
ఇది మంచి ప్రభుత్వం అంటూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించి మళ్లీ మాకు కూటమి ప్రభుత్వమే కావాలంటూ తమ ఆకాంక్షను కాజూరు ప్రాంత ప్రజలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియజేసారు.