
TPCC State General Secretary Nallapu Durga Prasad
అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్
నేటి ధాత్రి చర్ల
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు