
ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన పీఎంపి వెల్ఫేర్ అసోసియేషన్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ని కలిసి తెలంగాణ ఆర్ఎంపి & పీఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ నాయకులు
గ్రామీణ ఆర్.ఎం.పి వైద్యుల పైన జరుగుతున్న డిఎం అండ్ హెచ్ ఓ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రధమ చికిత్స కేంద్రాల పైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపైన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి దాడులను నివారించవలసిందిగా కోరడం జరిగినది అదేవిధంగా ఆర్ఎంపి& పిఎంపీల గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్ఎంపి సమస్యల పైన లోతుగా విశ్లేషణ చేసి అన్ని విధాల ప్రభుత్వం మీకు అండదండలుగా ఉన్నది అని చెప్తూ ఆగిపోయిన శిక్షణ పూర్తి చేసి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగినది, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం అతి త్వరలో భూమి పూజ కార్యక్రమం చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగినది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ గౌడ్ జనరల్ సెక్రెటరీ బాలరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్ల రాజు జిల్లా చైర్మన్ లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కిషన్, రఘు, అశోక్ , ఎథిక్స్ కమిటీ చైర్మన్ రమణ,భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు రమేష్ కార్యదర్శి చారి, జిల్లా సీనియర్ నాయకులు చారి, సీనియర్ వైద్యులు మోహన్ రెడ్డి రూరల్ అధ్యక్షులు అశోక్ రెడ్డి టేకుమట్ల అధ్యక్షుడు భాస్కర్ , కార్యదర్శి రంజిత్, జిల్లా నాయకులు రవీందర్,రేగొండ అధ్యక్షులు శ్రీధర్, జిల్లా సీనియర్ కుమార్ చిట్యాల అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, రాజు, సీనియర్ నాయకులు నాగేందర్, స్వామి, గోరికొత్తపల్లి అధ్యక్షుడు శ్యామ్, మొగుల్లపల్లి అధ్యక్షులు భద్రయ్య, సీనియర్ వైద్య మిత్రులు పాల్గొన్నారు