
వైస్సార్ సేవలు చిరస్మరణీయం
మెట్ పల్లి నేటి ధాత్రి
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను భారత దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దిన మహా నాయకుడు ఎండాకాలం పంటలు నీళ్లు లేక సరిగా పండుతాలేవని ఆలోచించి వరద కాలువ అనే ఒక బ్రహ్మాండమైన కాలువను తవ్వించిన మహా నాయకుడు అందుకే ప్రతి ఇంట్లో వైయస్సార్ ఫోటో ఉంది అంటే అది ఆయన చేసినటువంటి గొప్ప పనుల వల్లే అని తెలిపారు ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి వందేమారుతి బాపూజీ కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్ యూత్ నాయకులు బైండ్ల శ్రీకాంత్ కోరే రాజు కుమార్ కోట మహేష్ నవీన్ గోవి శీను రాకేష్ తదిరితేలు పాల్గొన్నారు.