
కాకతీయ హైస్కూల్లో వన మహోత్సవం.
చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత చెట్లను మనం రక్షించినట్లయితే చెట్లు మనలను రక్షిస్తాయి చెట్లు నాటడం వలన పర్యావరణం సమతుల్యంగా ఉండి సకాలంలో వర్షాలు పడి నీటి ఎద్దడి ఉండదు చెట్లు మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి చెట్లు కార్బన్డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చి ఆయుష్షును పెంచే విధంగా చేస్తాయి చెట్లు అనేక జీవులకు నివాసం కల్పించి మనకు పండ్లు వేసవికాలంలో నీడనిచ్చి సేద తీరుస్తాయి అందుకే విద్యార్థులు మీ ఇంటి ముందు గానీ ఖాళీ ప్రదేశాలున్నచోట మొక్కలు నాటాలని కోరారు ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ ఆఫీస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.