
ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రికి ఆదర్శమని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 108 వాహనం, పేదలకు ఆరోగ్యశ్రీ ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ప్రజలకు చేరవేసిన మహానేత అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల వేణు, బుడిగ శ్రీనివాస్, గోపతి బానేష్,గోపు రాజం,రామ కృష్ణ,బొద్దుల ప్రేమ్ సాగర్,పసరకొండ కృష్ణ,గోళ్ళ మల్లేష్,రామ్ సాయి,రవీందర్,గూడ సత్తయ్య, లచ్చులు, మహిళ నాయకురాళ్లు పందుల సునీత, కమల,జాలిగపు రాజేశ్వరి, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.