
తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైయస్సార్.
ఓటమి ఎరుగని నాయకుడు మొగులపల్లి కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులుక్యాతరాజు రమేష్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి.
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా విలేకరుల సమావేశంలో మొగులపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైయస్సార్ ఆయనవ్యక్తిగతం ఎందరికో ఆదర్శం రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరే ఉంటారు అలాంటి వారిలో వైఎస్ఆర్ ముందుంటారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు ఎప్పుడు తెలుగు వారి సంప్రదాయమైన పంచ కట్టు లోనే కనిపించేవారు పంచకట్టుకి ఆయన గుర్తింపు తీసుకువచ్చారు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేటప్పుడు నవ్వుతూ పలకరించేవారు ఆయన నడవడిక మాటల్లో హుందాతనం ఉండేది నిత్యం నవ్వుతూనే కనిపించేవారు ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వైయస్సార్ చేపట్టిన సేవలు చాలా గొప్పగాని వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్‌తో పాటు రైతు జీవితాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత విద్యుత్తు నీటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి పదం వైపు నడిపి నడిపారని తెలిపారు జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఏనాడు ఓటమి ఎరుగని నేత రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతు జన బాంధవుడు లక్ష కోట్లు ఖర్చయిన కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత పింఛన్లుదారులకు ప్రతి ఒకటో తారీకు నే పింఛన్ అందించడం వైయస్ పాలనలోనే మొదలైంది పేదలకు కుటుంబాలకు విద్యార్థులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని 108ను స్థాపించిన గొప్ప మహానుభావుడు అని ఏరంగాన్ని ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్ఆర్ మహానేత ఆదర్శం తోనే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పేదలకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ దిశగాసాగుతుంది అని తెలిపారు