
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మహాదేవపూర్ నేటి ధాత్రి
మహాదేవపూర్ మండలం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రెస్ క్లబ్ ఆవరణలో వ్యవస్థాపక అధ్యక్షుడు బన్సోడా రామారావు గారి ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు మీర్జా ముబిన్ అహ్మద్ బెగ్, ఉపాధ్యక్షుడు జాగరి అశోక్, వీర గంటి రాజు, ప్రధాన కార్యదర్శి అడప రమేష్, కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి మజీద్, కార్యవర్గ సభ్యులు చిటికేసి శ్రీనివాస్, దేవేందర్, సాకేత్, శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మీర్జా ముబిన్ అహ్మద్ బెగ్ మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారంతో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శశాంక్, కేదారి ప్రవీణ్ కుమార్, పరమ రాజ్యుల శివకుమార్, రాజబాబు, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు