
విద్యను కషాయంగా మార్చుతున్న కేంద్ర పాలకులు రాదండి. దేవేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
జాతీయ విద్యావిధానం 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు “కాషాయ విష గరళం”గా మార్చుతున్నారని తెలంగాణవిద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాదండి దేవేందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం
కాషాయం “కషాయం”గా మారి “విషం” గా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో “బహుజన దేశం” గా ఉన్న భారతదేశాన్ని “బ్రాహ్మణ దేశం”గా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు అని వారు అన్నారు