
గిరిజనులకు కూరగాయ విత్తనాలు అందించిన వనవాసి కళ్యాణ పరిషత్ సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు
నేటిధాత్రి చర్ల
ఆదివాసీలు తమ పెరటిలో కూరగాయల పెంపకం చేపట్టి స్వయం సమృద్ది సాదించాలన్నదే వనవాసీ కళ్యాణ కళ్యాణ పరిషత్ ముఖ్య ఉద్దేశం అని సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు అన్నారు సంస్ద ద్వారా పంపిణీ చేసేందుకు వచ్చిన కూరగాయల విత్తనాలను నరసింహారావు వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత పలువురు ఆదివాసీలకు పంపిణీ చేసారు స్దానిక కొమరం భీం విద్యార్ది నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు చర్ల మండలంలోని సుమారు 50 గ్రామాలలోని గిరిజనులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సుమారు 4 వేల విత్తన ప్యాకెట్లు మండలానికి చేరుకున్నట్లు వివరించారు ప్రతి ఏటా గిరిజన గ్రామాలకు తమ కార్యకర్తలు వెల్లి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు గిరిజన గ్రామాల ప్రజలు పోషకాహారం దొరకక అనారోగ్యంతో బాదపడుతున్నందున వారి పెరటిలోనే పోషకాహారంతో కూడిన కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు దీనికి తోడు గిరిజన గ్రామాల ప్రజలు వర్షాకాలంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాలకు రావాలంటే వాగులు వంకలు పొంగి రహదారులు మూసుకుపోయి ఇబ్బందులు పడుతుంటారని ఇటువంటి ఇబ్బందులను అదిగమించేందుకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఇలా గత తొమ్మిది సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని కూరగాయలు పండించిన ఆదివాసీలు వాటిలో కొన్ని కూరగాయలను విద్యార్ది నిలయంకు అందచేసే మంచి సాంప్రదాయం ఉందన్నారు గిరిజనులు సంస్ద అందిస్తున్న విత్తనాలను సద్వినియోగపరుచుకొని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాదించాలని విజ్ఞప్తి చేసారు ఈ కార్యక్రమంలో వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు నిలయ కమిటి ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు నిలయ కమిటి సభ్యులు పాశికంటి శ్రీదేవి శివరాజు కిషోర్ రాజేష్ ఎం శ్రీనివాస్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు