
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
నేటి ధాత్రి చర్ల
వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ముఖ్యంగా ఆరొగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉచిత విద్యుత్ సరఫరా రైతు బంధు వంటి పథకాల ద్వారా పేదలకు జీవితంలో వెలుగు చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు
వైఎస్సార్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు