
చొప్పదండి నుండి బూరుగుపల్లి వరకు రోడ్డు మరమ్మతులు వెంటనే ప్రారంభించాలి- బీజేపీ మండల అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రము నుండి గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామం వరకు రోడ్డు మరమ్మతులు తొందరగా చేయాలని బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే ఈరోడ్డు మంజూరు అయిందని, కానీ అప్పటి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదని, కేవలం వారి ఇంటి ముందు మాత్రమే రోడ్డు వేసుకొని మిగతా రోడ్డు వేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. చినుకు పడితే చిత్తడిగా మారి వాహన దారులకు, ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత శాసనసభ్యులు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించి, ప్రజలను ఇబ్బందులు పడకుండా చూడాలని వారు కోరారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలను కలుపుకొని భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈసందర్బంగా హెచ్చరించారు.