
బొలోరో వాహనం డీకొట్టగా వ్యక్తి మృతి
వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని చల్లూరు గ్రామం లో ఉదయం వాకింగ్ చేస్తూ ఇంటికి వస్తున్న మార్గమధ్యంలో కొలిపాక రాజయ్య తండ్రి రాములు, 60 వయస్సు మామిడాల పల్లి నుండి చల్లూరు వైపు వస్తున్న బొలోరో వాహనం రాజయ్యను వెనుక నుండి ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు . సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటన స్థలాన్నికి ఎస్సై చేరుకొని, బొలెరో వాహనం నడిపిన వ్యక్తి ఎడ్ల రాజిరెడ్డి అదుపులోకీ తీసుకొని బులెరో తో పాటుగా రాజిరెడ్డి ని పోలీస్ స్టేషన్ కీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై ఆవులు తిరుపతి తెలిపారు.