
బంగారు పతకం సాధించిన ఐసిడిఎస్ ఈఓ ఆర్.కవిత
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఐసిడిఎస్ ఈవో గ్రేడ్ 1 సూపర్వైజర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్.కవితకి కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా సైకాలజీ విభాగంలో కాకతీయ యూనివర్సిటీ లో పిజి పూర్తిచేసుకుని యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు గాను బంగారు పతకం,ప్రశంసా పత్రాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఆర్.కవిత మాట్లాడుతూ ఈ బంగారు పతకం సాధించడం నా తల్లిదండ్రులు లక్ష్మీ,రాజయ్యల ప్రోత్సాహం ఎంతగానో ఉందని,ఆడపిల్ల అనే రెండో ఆలోచన లేకుండా వారి సాయి శక్తుల్ని పెట్టి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారని ఉన్నారు.నేను ఈ స్థాయిలో రాణించడానికి భర్త వెంకటేష్,అన్నయ్య కరుణాకర్ ల తోడ్పాటు ఎంతగానో ఉందని తెలిపారు.