
భారతీయ చరిత్రలో చారిత్రాత్మక ఉద్యమం దండోరా
◆- డప్పోల్ల రమేష్, ప్రముఖ కవి, రచయిత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ కేంద్రంగా అబ్రహం మాదిగ సమన్వయంతో,ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక రాభసా గృహం నందు ఏర్పాటు చేసిన వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రముఖ కవి, రచయిత డప్పోళ్ల రమేష్,కే. మాణిక్ రావు శాసనసభ్యులు జహీరాబాద్,వై నరోత్తం ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాట్లాడుతూ భారతీయ సామాజిక ఉద్యమాల చరిత్రలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం చారిత్రాత్మకమైనదనీ, సామాజిక విప్లవాల సూర్యుడుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ యుగ పురుషుడుగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సామాజిక న్యాయం పునాదిగా ముప్పై ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారని అన్నారు. మాదిగ జాతికి ఆత్మ గౌరవ ప్రతీకగా భారతీయ సమాజంలో నిలిచిపోయారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సైతం ఉద్యమం నడిపిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు మాత్రమే దక్కిందని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన ఘనత ఒక్క ఎమ్మార్పీఎస్ దేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ ఉద్యమం చేసి చట్టాన్ని కాపాడిందన్నారు. ఎమ్మార్పీఎస్ నడిపిన గుండె జబ్బు పిల్లల ఉద్యమం చేసి దేశవ్యాప్త ఆరోగ్యశ్రీ పథకం రావడానికి స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు పెరగడానికి ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమ ఫలితం అన్నారు. ఆకలి కేకల ఉద్యమ యాత్రతో రేషన్ బియ్యం పెంపు జరిగిందన్నారు. అమరవీరుల తల్లుల కడుపుకోత ఉద్యమంతో అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చేసిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిరంతరం చేసి సమాజంలోని అన్ని వర్గాలకు అండగా ఎమ్మార్పీఎస్ నిలిచిందని అన్నారు. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు.
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం ఒకే రోజు కావడంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీ,బిఆర్ఎస్, సిపిఐ, యంఐయం, డిఎస్పి పార్టీ నాయకులకు సన్మానీచడం జరిగింది. నరేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువత జిల్లా అధ్యక్షులు,రాందాస్ మాజీ జడ్పీటీసీ, నర్సిoములు సుధీర్ బండారి, అత్తర్ అహ్మద్, జ్యోతి పండాల మహిళా మోర్చా జిల్లా నాయకురాలు,ప్రేమ్ దాస్ జాషువా స్టడీ ఫారం,మహేందర్ డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు, వరాల్ అరుంధతి సంగం, జైరాజ్, సుధాకర్, శివకుమార్, స్వామిదాస్, యిర్మీయా, ప్రకాష్,దేవదాస్ గుంజెటి, మోజెస్, నవీన్ మాదిగ జర్నలిస్ట్ ఫారం జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సిoములు రాయికోటి, ఇజ్రాయెల్ బాబీ, అజయ్, తుల్జారాం,కవేలి కృష్ణ, సుందర్, అనిల్, సుకుమార్, ప్రశాంత్, మధు, సురేష్, జైరాజ్ మాదిగ ,నిర్మల్, టీంకు, మైకేల్, పద్మారావు,సుదీష్, దయానంద్,ప్రభాకర్, శివప్ప, బండి మోహన్, ప్రతాప్,శంకర్,లావన్, సందీప్, జాన్సన్,మనోజ్, పవన్, సుదర్శన్,మోహన్, పుటరాజ్ తదితరులు పాల్గొన్నారు.