
ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
M R P S మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మంద కృష మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్ మాదిగ హాజరైజెండా ఆవిష్కరణ చేశారు స్వీట్ల పండ్లు పంపిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తదనంతరం మండల సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాల ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజం అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో B J P భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి B J P జిల్లా నాయకులు శవ శేషగిరి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జీడీ సంపత్ మాదిగ అంతడుపుల సారంగపని మాదిగ రొంటాల రాజ్ కుమార్ మాదిగ మంద సాంబయ్య మాదిగ బండారి రామస్వామి మాదిగ పుల్యాల భగత్ మాదిగ వివిధ గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు