
నేటిధాత్రి ఎఫెక్ట్..
ఆటోనగర్ రోడ్డులో ఉన్న చెత్త ఆటోను తొలగించిన మున్సిపల్ అధికారులు
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ ఆటోనగర్ రోడ్డులో, కాళోజీ యూనివర్సిటీ ముందు గత కొన్ని రోజులుగా ఆటోలో పేరుకుపోయిన చెత్త ఉండగా స్థానికుల పిర్యాదు మేరకు, “చెత్త ఆటోను తొలగించండి మహాప్రభో” అని “నేటిధాత్రి” కథనం ప్రచురించగా, సదరు వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే ఆటోనగర్ రోడ్డులో చెత్త ఆటోను తొలగించారు. మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన స్థానిక ప్రజలు.