
ఆకాశం వైపు.. రైతన్న చూపు
వెల్దండ /నేటి ధాత్రి
గత కొన్ని రోజులుగా వర్షాలు పడకపోవడంతో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు మొక్కలకు నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా వర్షం కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్షం ఎప్పుడు కురుస్తుందా..! అంటూ ఆకాశం వైపు రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓసారి మొక్కజొన్న సాగు చేశామని తడి లేకపోవడంతో ఎండిపోయిందని.. రెండవసారి సాగు చేశామని ఇప్పుడు కూడా వర్షాలు పడకపోతే తమకు ఆర్థిక నష్టాలతో.. కన్నీళ్లే మిగులుతాయని రాచూరు గ్రామానికి చెందిన పలువురు రైతులన్నారు. వర్షాలు కురవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.