
ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఆవిష్కరణ..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండాను ఆ సంఘ సభ్యులు ఆవిష్కరించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకల నేపథ్యంలో టౌన్ ప్రెసిడెంట్ రాచర్ల సరేష్, సంఘ సభ్యులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టౌన్ ప్రెసిడెంట్ రాచర్ల సరేష్ మాట్లాడారు. మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ పోరాటం మొదలుపెట్టి నేటికి 30 సంవత్సరాలు గడిచాయని, మాదిగ రిజర్వేషన్లు ఎ,బి,సి,డి లు గా వర్గీకరణ సాధించిన మొదటి సంవత్సరంగా గుర్తుచేసుకుంటూ జండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నూరి రాజేందర్, ఆరింద సతీష్, రేణిగుంట్ల పోషం, రమేష్, ఆగయ్య, మల్లేష్, పూర్ణచందర్, కలువల శ్రీనివాస్, కలువల శంకర్, సుభాష్, స్వామి, రాచర్ల అనీల్ తదితరులు పాల్గొన్నారు.