
Shoping Tips
షాపింగ్ చేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి..
ఈ రోజుల్లో చాలామంది షాపింగ్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్ అడిగే సాంప్రదాయం ఎక్కువయ్యింది. అయితే, మొబైల్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలా? లేదంటే ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం..
చాలా మందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టం. ముఖ్యంగా మహిళలకు షాపింగ్ అంటే చాలు వెంటనే రెడీ అవుతారు. షాపింగ్ చేయడం అనేది ఒక వినోదంగా, ఒత్తిడిని తగ్గించే మార్గంగా భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలామంది షాపింగ్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్ అడిగే సాంప్రదాయం ఎక్కువయ్యింది. అయితే, షాపింగ్ చేసినప్పుడు కచ్చితంగా మొబైల్ నెంబర్ ఇవ్వాలా? అలా ఇవ్వకపోతే ఏం అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం, మీరు మొబైల్ నంబర్ ఇవ్వకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. మీకు కావాల్సిన వస్తువులను మీరు కొనుక్కోవచ్చు. అలా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది
ఫిర్యాదు ఎలా చేయాలి?
- మీరు 1800-11-4000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- consumerhelpline.gov.in వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.
- NCH యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేసిన తరువాత కూడా మీరు కొన్న వస్తువులు లేదా సర్వీసులు ఇవ్వకపోతే చట్ట ప్రకారం షాప్ యజమానికి శిక్ష పడే అవకాశం ఉంది.