
Minister K Surekha.
బీరన్న బోనాల ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి కొండా సురేఖ?
వరంగల్, నేటిధాత్రి
తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ లోని కరీమాబాదులో ఆదివారం సాయంత్రం, బీరన్న బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నట్లు సమాచారం.
వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీజేపీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంటా రవికుమార్ లు కూడా రానున్నారు.
అయితే.. ఒకే కార్యక్రమానికి మూడు పార్టీల నేతలు హాజరు కానుండడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.