
AP Deputy Chief Minister.
పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా..
ఆర్కే సాగర్ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపుదిద్దుకొంది. ఈ సినిమా…ఆర్కే సాగర్ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపుదిద్దుకొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, హీరో పవన్‌కల్యాణ్ శనివారం విడుదల చేశారు. ‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం. కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అంటూ విక్రాంత్ ఐపీఎస్ పాత్ర పోషించిన ఆర్కే సాగర్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఫిట్నెస్ కలిగి అద్భుతంగా కనిపించారాయన. మిషా నారంగ్ హీరోయిన్గా నటించారు. సస్పెన్స్, థ్రిల్స్‌తో ఎంతో గ్రిప్పింగ్‌గా ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను దర్శకుడు రూపొందించారు. విడుదలకు ముందే సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్ పెంచేసింది.