
B. Poornima
జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ప్రకటన విడుదల
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా మామూనూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు 13 డిసెంబర్ 2025 నాడు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ 2014 మే 1, నుండి 2016 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్హులు ఎంపిక పరీక్షకు అర్హులు అని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4వ తరగతులు చదివి ఉండాలని పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 29వ తేదీలోగా ఆన్లైన్లో www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మిగతా వివరాలకు 94910 34552 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ తెలిపారు.