
Congress party
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..
ఎమ్మెల్యే పై అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు..
సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం బిఆర్ఎస్ పాపం..
శిలాఫలకాలు వేయడమే తప్ప పనులు ప్రారంభించని బిఆర్ఎస్..
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..
రామాయంపేట జూలై 5 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మాట్లాడి అర్హత బి.ఆర్.ఎస్ నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి ఎంత మాత్రం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం లేకపోవడంతో పాటు తక్కువ సమయంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు పట్ల ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలు వేయడం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన ఘటనలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలలు కాలం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో వేగంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లో 250 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను సైతం వారం రోజుల్లోకి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రావుకు దక్కింది అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కుంటూపడిందని కనీసం తన స్వగ్రామం కోనాపూర్ కూడా అభివృద్ధి నోచుకోని దుస్థితి దాపురించింది అన్నారు. రామయంపేట రెవిన్యూ డివిజన్ ప్రకటించి ఆర్డిఓ కార్యాలయం, సిబ్బంది నియమించకపోవడం కనీసం ఆర్డిఓ ఎవరు తెలియని పరిస్థితి అప్పటి బి ఆర్ ఎస్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. తూతు మంత్రంగా రెవిన్యూ డివిజన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, దేమే యాదగిరి చిలుక స్వామి, బైరం శంకర్ కంచర్లు పాల్గొన్నారు.