
Credit Score
సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే చాలా మంది లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాన్ని తిరస్కరిస్తున్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ గురించి రుణం తిరస్కరణకు గురవుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.సిబిల్ స్కోరు అంటే మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ యోగ్యతకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ దరఖాస్తులను ఆమోదించడానికి పరిగణించే అంశాల్లో ఒకటిగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పేర్కొన్న నగరాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ నగరాల్లో నివసించే పౌరులకు మాత్రమే అవి క్రెడిట్ ఉత్పత్తులను ఆమోదించవచ్చు. ఉదాహరణకు హెచ్ఎస్బీసీ వెబ్సైట్ ప్రకారం హెచ్ఎస్బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలలో ఒకటి దరఖాస్తుదారు నివసించే నగరం. చెన్నై, గుర్గావ్, ఢిల్లీ, పూణే, నోయిడా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్ లేదా కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటేనే రుణాన్ని మంజూరే చేస్తాయి.
మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే మీ కెరీర్లో అస్థిరంగా ఉన్నందున బ్యాంక్ దానిని పరిగణిస్తుంది. బ్యాంకులు తమ రుణగ్రహీతలు స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉండాలని ఇష్టపడతారు. కెరీర్ స్థిరత్వం నెలవారీ ఆదాయం క్రమం తప్పకుండా రావడానికి హామీ ఇస్తుంది. దీనిని వ్యక్తిగత రుణ ఈఎంఐ ఇతర బాధ్యతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.