
Gram Panchayat
అనుమతులు గోరంత…! కట్టడాలు కొండంత…!
అక్రమ నిర్మాణమే… నోటీసులతో సరిపెట్టాం…
గత గ్రామపంచాయతీ అధికారులు
అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…!
సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు
మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారా… నోటీసులతో సరిపెట్టుకుంటారా…?
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు ముక్కున వెలుసుకుంట్టున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.ఒక సామాన్యుడు కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటే నానా తిప్పలు తప్పవు, గతంలో ఒకటి రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పర్మిషన్ల పేరుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆ పేపరు ఈ పేపర్ తీసుకురా అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకునే అధికారులు అదే బడా వ్యాపారస్తు లు డబ్బున్న కోటీశ్వరులు నిర్మాణ సముదాయలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నన్ను ఎవరేం చేయలేరు అనే ధీమాతో అందరూ చూస్తుండగానే నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తున్న సంఘటనలు. యాదేచ్చకంగా జరుగుతున్నాయి, అధికారుల కళ్ళేదుట బహుళ అంతస్తుల అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు నిర్మించినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది..వివరలోకి వెళితే కేసముద్రం మున్సిపాలిటీ మండల కేంద్రం నడిబొడ్డున మార్కెట్ రోడ్ ప్రధాన రహదారి లో ఓ ప్రముఖ టెక్స్టైటైల్స్ షాపింగ్ కాంప్లెక్స్ జి ప్లస్ టు..అనుమతులు పొంది పంచాయతీరాజ్ చట్టం – 2018 నియమ నిబంధనలను అతిక్రమించి జి ప్లస్ టు అనుమతలు ఉన్న నిర్మాణాన్ని బహుళ అంతస్తుల అనగా ఐదు పోర్లతో అక్రమ నిర్మాణం చేపట్టి ఎలాంటి ఫైర్ సేఫ్టీ మరియు వెంటిలేషన్ రూల్స్ పాటించకుండా నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో అంత పెద్ద బహుళ అంతస్తులు నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా? అంతటి అంతస్థకు ఆ ప్రదేశంలోని నేల సరి అయినదేనా కాదా అది తేల్చాల్సింది జియో లాజికల్ మైన్స్ సేఫ్టీ అధికారులు నిర్ధారణ అనుమతులు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా ఐదు ఫ్లోర్లకు గాను లిఫ్ట్ నిర్మించారని ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవిస్తే షాపులో పనిచేసే వర్కర్స్ ప్రాణాలతో చెలగాటమేనని పలువురు భావిస్తున్నారు.కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా సేఫ్టీ అనుమతులు అవేమీ లేకుండా ఎలా నిర్మిస్తారని, అనేక ప్రశ్నలకు తావిస్తుందనేది ప్రజల మాట.అట్టి బహుళ అంతస్తుల నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు ప్రమాదం జరుగుతుందని అనేది చర్చ జరుగుతుంది.గతంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదనపు అంతస్తుల నిర్మిస్తున్న సమయంలో ఒక భవన నిర్మాణ కార్మికుడు పై అంతస్తూ నుండి పడి మృతి చెందిన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన ఏ మాత్రం నిర్మాణం ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసిన పరిస్థితి కళ్ళముందే కనబడుతుంటే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న కూడా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో…?అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారులు చట్టాలను కేవలం నిరుపేదలపై సామాన్యులపై ప్రయోగిస్తారా.బడా వ్యాపారస్థులకు డబ్బు పలుకుబడి దారులకు కొమ్ము కాస్తున్నారని ప్రజల ఆరోపణలు బహాటంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణదారులపై కొరడా జులిపించాలని సత్వరమే స్పందించి పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలని,అలాగే ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని మున్సిపల్ శాఖ అధికారులు కాలయాపన చేయకుండా ఇలాంటి అక్రమ దారుల ఆగడాలకు చెక్ పెడతారా లేదా…!తెలిసిన తెలియనట్టు వదిలేస్తారా…? నోటీసులతో సరిపెడతారా …? ఇకనైనా చట్టాలపై నమ్మకం కలిగిస్తారా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారు