
Railway Fares
పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…
నేటి ధాత్రి -గార్ల:-
కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే తగ్గించి, సామాన్యులకు రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మధ్యతరగతి, పేద ప్రజలపై రైల్వే చార్జీల పెంపుదల భారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రయాణించే రైల్వే ఛార్జిలను పెంచి, ప్రయాణికులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు.పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి.పి.వెంకటేశ్వర్లు,యం.నాగమణి,మండల కమిటి సభ్యులు సిహెచ్ ఎల్లయ్య, ఎ.రామకృష్ణ,జి.వీరభధ్రం,ఎస్.నాగరాజు,బి.నరేష్,బి.ఝాన్సీ, ప్రవీణ్,కోటయ్య,రమేష్,సంపత్,నరేష్,ప్రసాద్,రైల్వే ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.