
SS Vinay Kumar.
రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
● – ఎస్సై వినయ్ కుమార్….
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.