
Dharni Madhukar.
అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..?
సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు.
గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఈనెల 2వ తేదీన స్థానిక ప్రెస్ క్లబ్ లో బేర సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అసత్యపు మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
నిరాధారణమైన వాక్కులు అంత మంచివి కావని హితువు పలికారు.తాను ఎవరి భూములను అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే దైవ సాక్షిగా ఆ భూములను ఈ ప్రాంత ప్రజలకు బే షరతుగా పంచుతానని పత్రికా ముఖంగా తెలుపుతున్నానని అన్నారు.
తగిన ఆధారాలతో శనివారం సర్వేనెంబర్ 8 లోని రైస్ మిల్లు వద్దకు వస్తే నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు.
నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం అనేక పార్టీలు మారావే కానీ నిన్ను గెలిపించి రాజకీయంగా పదవులు కట్టబెట్టిన 21వ వార్డు ప్రాంత ప్రజలకు ఏ విధంగా నువ్వు సహాయం చేయలేదని విమర్శించారు.
నువ్వు ఎంపీపీ స్థానంలో ఉండి రొడ్డ రాజేశం,గాజుల విజయలక్ష్మి,తిప్పని పద్మ, పోతురాజుల రమేష్ వంటి పేద ప్రజలకు సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన విషయాన్ని మర్చిపోయావ అని గుర్తు చేశారు.వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా 21 వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక రాజకీయంగా భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతాడనే ఉద్దేశ్యంతో అసత్య ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు.
భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి తాను సిద్ధమని ప్రజల మద్దతు ఎవరికో వేచి చూడాలని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.