గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
హైదరాబాదులోని ఎల్.బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నాయకులకు సూచించారు. గురువారం చిట్యాల లోని ఎమ్మెల్యే మినీ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్కురి ధర్మారావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. హైదరాబాదులోని ఎల్.బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, భూపాలపల్లి నియోజకవర్గం నుండి వెయ్యి మందికి తగ్గకుండా రావాలని సూచించారు. ఈ సమ్మేళనానికి మల్లికార్జున ఖర్గే పాటు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య కాంగ్రెస్ గ్రామ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.